తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా తిరుపతి–అకోలా మధ్య రెగ్యులర్ బేసిస్‌పై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకోలా–తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు –17430 నంబర్‌తో మే 3వ తేదీ నుంచి శుక్రవారాలు ఉదయం 9.15 గంటలకు అకోలాలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17429 నంబర్ రైలు మే 8వ తేదీ నుంచి ఆదివారాలు మధ్యాహ్నం 12.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు అకోలా చేరుకుంటుంది. ఇది తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్డు, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్డు, మహబూబ్‌నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణా, బస్మత్, హింగోలి దక్కన్, వాసిం మీదుగా అకోలా చేరుకుంటుంది.


