చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు అందజేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ భవనంలో సోమవారం దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పీడీ మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత, రవాణా కష్టాలను తీర్చి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి నిరంజన్‌రెడ్డి, ఎంవీఐ నరసింహులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి పాల్గొన్నారు.


