– ఉరేసుకుని యువకుడి మృతి
కార్వేటినగరం: ఓ యువకుడు తన ప్రియురాలిపై అనుమానం పంచుకున్నాడు. ఆపై ఉరివేసుకుని తనువు చాలించిన ఘటన మేజర్ పంచాయతీ కార్వేటినగరం పద్మసరస్సు ఎస్టీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. పద్మసరస్సు ఎీస్టీ కాలనీకి చెందిన రాజయ్య కుమారుడు చంద్రశేఖర్(35), అదే కాలనీలో నాగలాపురం నుంచి వచ్చి తన అమ్మగారింట్లో ఉంటున్న వివాహితతో కొన్నేళ్లుగా సఖ్యతగా ఉంటున్నాడు. ఇటీవల ఆమైపె అనుమానం పెంచుకున్న చంద్రశేఖర్, సోమవారం కుప్పానిగుంట సమీపంలోని కొందుగాని మిట్ట వద్ద ఉరివేసుకుని చనిపోతున్నట్టు ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వద్దని వారించి.. ఆపై వారి బంధువులకు సమాచారం అందించింది. హుటాహుటిన వారు ఘటనా స్థలానికి వెళ్లి గాలించగా.. అప్పటికే చంద్రశేఖర్ ఓ చెట్టుకు ఉరివేసుకుని మృతిచెంది ఉండడం చూసి కన్నీంటి పర్యంతమయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని యువకుడి మృతికి గల కారణాలపై ఆరాతీశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తేజస్విని తెలిపారు.


