
ప్రభుత్వ మార్గదర్శకాలతోనే ఆటోమ్యుటేషన్
చిత్తూరు : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆటోమ్యుటేషన్ విధానం పెట్టారని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభించిన ఆటో మ్యుటేషన్ విధానంపై శుక్రవారం చిత్తూరు అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్, సహాయ కమిషనర్ ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆటో మ్యుటేషన్‌ను పూర్తిచేయాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. నూతన విధానంపై అధికారులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్వో గోపాలకృష్ణవర్మ, సబ్ రిజిస్ట్రార్ హేమంత్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
తగ్గిన రిజిస్ట్రేషన్లు
నూతన విధానంతో మొదలైన రిజిస్ట్రేషన్స్ సంఖ్య మొదటి రోజు పలు కారణాలతో తగ్గాయి. నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం, డ్యాకుమెంటేషన్ సమయంలో ఎర్రర్ రావడం, పన్నులు అప్‌డేట్ సక్రమంగా చూపకపోవడం వంటి సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం 40 వరకు రిజిస్ట్రేషన్స్ జరగ్గ, శుక్రవారం 20 రిజిస్ట్రేషన్స్ మాత్రమే జరిగాయి.
ఆగస్టు 15 తర్వాత పరీక్షలు నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15 తర్వాత పరీక్షలు నిర్వహించాలని వైఎస్సార్ టీఏ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించనున్న ఎఫ్‌ఏ–1 పరీక్షలు ఈ నెల 15 తర్వా త నిర్వహించాలన్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఈ నెల 4వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను ఈ నెల 11 నుంచి 14 వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశించారన్నారు.