
శ్రీసిటీలో ‘అక్షరధామ్’ గురువులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఢిల్లీలోని ప్రముఖ అక్షరధామ్ స్వామి నారాయణ్ ఆలయానికి చెందిన ఆధ్యాత్మిక గురువులు అక్షర్ ప్రేమ్, వినమ్రవదన్ శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. వీరికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను వారికి వివరించారు. పర్యటనలో భాగంగా పారిశ్రామికవాడ పరిసరాలతో పాటు స్థానిక ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన శ్రీసిటీ ఉద్యానవనాన్ని స్వామీజీలు సందర్శించారు. అక్కడ నుంచి డైకిన్ ఏసీ పరిశ్రమకు వెళ్లి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. పచ్చదనం, పర్యావరణం, ఆధ్యాత్మికతకు పెద్దవేట వేస్తూ ముందుకు సాగుతున్న శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతిని ప్రశంసించిన స్వామీజీలు, శ్రీసిటీ ఎండీని అభినందిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు. దక్షిణ భారతదేశంలో శ్రీ సిటీ కేంద్రంగా స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా వారికి ఎండీ విజ్ఞప్తి చేశారు.