
ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని పూజలు
రొంపిచెర్ల: మద్యం కేసులో అరెస్టు అయిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ రెడ్డీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మోటుమల్లెల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ఎదుగుదల చూడలేక చంద్రబాబు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. మిథున్‌రెడ్డి ఎలాంటి వాడో ప్రజలకు తెలుసన్నారు. మద్యం కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. కూటమి పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కరీముల్లా, విజయశేఖర్, శ్రీనాథనాయుడు, పెద్దిరెడ్డి దేవేంద్ర రెడ్డి, మునికృష్ణారెడ్డి, గురు, మహబూబ్‌బాషా, బావాజీ, రవీంద్ర, నీరజాక్షుల నాయుడు, ఐడియా కాలేషా, రాజాసాహెబ్, వెంకటరత్నం, బాబు, ఖలీల్, నరేంద్ర, సహదేవ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, కరుణాకర్, శ్రీకాంత్, రియాజ్, రవీంద్రనాథరెడ్డి, కుమార్ నాయుడు పాల్గొన్నారు.
పులిచెర్ల మండలంలో..
పులిచెర్ల(కల్లూరు): రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరిసించడంతోపాటు ఆయనకు బెయిల్ రావాలని కోరుతూ జిల్లా ప్రింటింగ్ ప్రెస్ మాజీ చైర్మన్ గోటూరి మురళీమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం పులిచెర్ల సమీపంలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం బయట వెయ్యి కొబ్బరి కాయలు కొట్టారు. వారు మాట్లాడుతూ ఏ తప్పు చేయని మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని, త్వరలో బెయిల్‌పై కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్వత్ బాషా, రెడ్డీశ్వరరెడ్డి, ఎన్‌ఎస్ రెడ్డి ప్రకాష్, మువ్వల నరసింహులు శెట్టి, రాయల్ మోహన్, రెడ్డి అహమ్మద్, మునీర్‌ఖాన్, ప్రతాప్‌రెడ్డి, జాఫర్‌హుస్సేన్, ఆనంద, ఎస్‌వీ రమణ, మునస్వామి, గంగయ్య, రాజమూర్తి, కిష్ణమూర్తి, జేడీ నారాయణ, మునిరత్నం, నాగరాజ, మధు, శ్యామ్‌రెడ్డి, శివారెడ్డి, నటరాజ, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని పూజలు