
మలేషియా వర్సిటీతో ఎస్పీడబ్ల్యూ కళాశాల ఒప్పందం
తిరుపతి సిటీ : యూనివర్సిటీ ఆఫ్ మలేషియా తెరెంగ్గాన్‌తో పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల మధ్య విద్యాభివృద్ధిపై ప్రతిష్టాత్మక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు శుక్రవారం పద్మావతి డిగ్రీ కళాశాల బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ, మలేషియా వర్సిటీ ఫిషరీస్ అండ్ ఫుడ్ సైన్స్ విభాగం అధ్యాపకులు డాక్టర్ మన్నూర్ ఇస్మాయిల్ షేక్ ఒప్పందపు పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్య, పరిశోధన, సాంస్కృతిక అంశాలతో పాటు విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలపై పరస్పర సహకారం అందిపుచ్చుకునేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ సి భువనేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు.