
డీఐసీ ఆశయానికి తూట్లు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పుట్టుకతోనే వివిధ అనారోగ్య సమస్యల బారిన పడిన పిల్లలను డీఐసీ కేంద్రానికి తరలించేందుకు ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఓ వాహనాన్ని కేటాయించింది. అయితే ఆ వాహన ఆశయానికి డీఐసీ కేంద్ర నిర్వాహకులు తూట్లు పొడుస్తున్నారు. పిల్లలను తీసుకొచ్చేందుకు బదులుగా..మందులు, మాత్రలు సరఫరాకు వాడుకుంటున్నారు. కలెక్టరేట్‌లోని మందులు, మాత్రల గోడౌన్ వయా డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం, డీఐసీకి మందులు, మాత్రలు సరఫరా చేసుకుంటున్నారు. ఇలా సరఫరా చేస్తూ... ఆ వాహనం డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద సాక్షి కంట పడింది. ఇదేమని కేంద్ర నిర్వాహకులను ప్రశ్నిస్తే...షరా మాముళ్లే అని కొట్టేపడేశారు. కాగా ఈ వాహనం కార్యాలయానికి వచ్చేంత వరకు ప్రత్యేక ప్రతిభావంతుడైన ఓ బాలుడు కార్యాలయంలోనే గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది.