
ఎంపీటీసీ ఉప ఎన్నికకు మూడు నామినేషన్లు
రామకుప్పం(కుప్పం): రామకుప్పం మండలం, మణీద్రం ఎంపీటీసీ స్థానానికి జరనున్న ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం మూడు నామినేషన్లు దాఖలైనట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. గతంలో వైఎస్సాసీపీ మద్దతుదారురాలు శాంతకుమారి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆమె అనార్యోగంతో మృతి చెండటంతో మణీంద్ర ఎంపీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు గుర, శుక్రవారాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందులో భా గంగా గురువారం వైఎస్సార్ సీపీ మద్దతుదా రు, మండల వైఎస్సార్ సీపీ కో కన్వీనర్ కుమా ర్తె హర్పిత నామినేషన్ వేశారు. టీడీపీ మద్దతుదారు అరుణా, విశాలాక్షి నామినేషన్ వేసినట్టు ఎన్నికల అధికారి లక్ష్మీకాంత్ తెలిపారు.
విద్యార్థుల్లో సామర్థ్యాల
పెంపునకు కృషి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సమగ్రశిక్షశాఖ ఏపీసీ వెంకటరమణ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గిరింపేట వద్ద ఉన్న సీఎంఎస్‌ఎస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న లీడర్ షిప్ ముగింపు కార్యక్రమానికి ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు లీడర్‌షిప్ శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. పాఠశాలల నిర్వహణలో నైపుణ్యాలు ముఖ్యమన్నారు. నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకుని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న టీచర్లకు గుర్తింపు పత్రాలను అందజేశారు. గుడిపాల ఎంఈవో 2 గణపతి, అసిస్టెంట్ ఏఎంఓ సుభాషిణి పాల్గొన్నారు.
సిజేరియన్లు తగ్గించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఆమె వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భవతులపై దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు గర్భవతులను నమోదు చేయించాలన్నారు. వారికి మెరుగైన వైద్య సేవలందేలా చూడాలన్నారు. హైరిస్క్ కేసులను గుర్తించాలన్నారు. సిజేరియన్లను తగ్గించాలన్నారు. టీనేజీ గర్భవతుల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. అబార్షన్లపై నిఘా పెట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమీక్షలో అధికారులు వెంకటప్రసాద్, అనిల్‌కుమార్, సుదర్శన్, ప్రవీణ, అనూషా, జార్జి, వేణుగోపాల్ పాల్గొన్నారు.
నిరుద్యోగులకు
ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకంలో నిరుద్యోగ యువతికి ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఫ్రంట్ ఆఫీస్ అసొసియేట్, బ్రాడ్‌బాండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ హెయిర్ స్టైలిస్ట్, డొమెస్టిక్ ఐటీ హెల్ప్‌డెస్క్ అటెండెంట్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వంద శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఎన్‌సీవీఈటీ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు సమీపంలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9959015657, 8686149492, 9866241270 నంబర్‌లలో సంప్రదించాలని ఆయన కోరారు.

ఎంపీటీసీ ఉప ఎన్నికకు మూడు నామినేషన్లు