
మేమింతే!
నగరిలో డైయింగ్ యూనిట్ల యజమానులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. రంగు నీళ్లను రోడ్లపై వదిలేస్తున్నారు.
ఆర్థిక బకాయిలు
చెల్లించండి
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల ఆర్థిక బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన చిత్తూరులో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలతో పాటు వారికి రావాల్సిన ఆర్థిక బకాయిలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. మూడు నెలల కాలంలో వారానికి ఒక సమస్యను లేవనెత్తి ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు దాదాపు రూ.25 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. 12 రకాల ఉద్యోగుల సమస్యలను మూడు నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నరేష్‌బాబు, కోశాధికారి దేవకుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బాలాజీరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చలపతిరెడ్డి, నాయకులు హరిప్రసాద్, మనోజ్, గౌరీశంకర్, మోహన్, దిలీప్ పాల్గొన్నారు.
– 8లో