పీఠంపై వేట ! | - | Sakshi
Sakshi News home page

పీఠంపై వేట !

Jul 31 2025 8:20 AM | Updated on Jul 31 2025 8:20 AM

పీఠంపై వేట !

పీఠంపై వేట !

● చైర్మన్‌ గిరికి పోటాపోటీ ● కాణిపాకం చైర్మన్‌ పదవిపై పలువురి ఆసక్తి ● మాజీ చైర్మన్‌కే మళ్లీ పగ్గాలంటూ ప్రచారం

కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం

కాణిపాకం : కాణిపాక క్షేత్ర చైర్మన్‌ కుర్చీపై టెన్షన్‌ మొ దలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్‌ కుర్చీపై పలువురు ఎక్కుపెట్టారు. ఆశావహుల్లో తీవ్ర పోటీ నెలకొంది. కొత్త ముఖాలు పుట్టుకొస్తున్నాయి.(టీడీపీకి చెందిన) మాజీ చైర్మన్‌కే మళ్లీ పద వి అంటూ మరోవైపు ప్రచారం జోరందుకుంది. మరో వైపు పలుకుబడి ఉన్నవాళ్లకు ఇస్తే మేలంటూ పలువు రు కూటమి నేతలు, ఉభయదారులు యోచిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ఖరారు కావడంతో చైర్మన్‌ ప్రకటన వచ్చే నెల ఉంటుందనే విషయం ఆశావహులతో పాటు కాణిపాక భక్తుల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

జిల్లాలో కాణిపాకంలో స్వయంభుగా వెలసిన శ్రీవరసిద్ది వినాయకస్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. నిత్యం వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు ఆలయానికి కానుక రూపంలో వస్తుంటాయి. అయితే ఐదేళ్ల కాలంలో ఆలయం అడుగడుగునా అభివృద్ధి పరుచుకుంది. ఈ అభివృద్ధితో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య, కానుకలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం భక్తుల సంఖ్య 10 వేల నుంచి 30 వేలు దాటుతోంది. ఈ స్థాయిలో ఉండే ఆలయానికి...చైర్మన్‌ కుర్చీ దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు.

చైర్మన్‌ రాజీనామాతో..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి వరకు ఉన్న చైర్మన్‌గా ఉన్న మోహన్‌రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసి ఏడాది కాలం దాటినా ఇంత వరకు కూటమి ప్రభుత్వం ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోతోంది. కొత్త పాలకవర్గంతో పాటు చైర్మన్‌ను ప్రకటించలేకపోతోంది. ఈ విషయాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ...జాప్యం చేస్తూ వస్తోంది. ఈజాప్యంతో చైర్మన్‌ పదవికి పోటీపడేవారి సంఖ్య పెరిగింది. కూటమిలోని కొందరు నేతలు నీకా..నాకా అంటూ పోటీ పడుతున్నారు. ఇన్నాళ్లు నలుగురు మాత్రమే అనుకుంటే...ఇప్పుడు మరి కొంత మంది పోటీపడుతున్నట్లు కాణిపాక వాసులు చెబుతున్నారు.

స్థానికులకే అవకాశం ఇవ్వాలని..

చైర్మన్‌ పదవిని స్థానికులకే ఇవ్వాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అందుకు కట్టుబడి చైర్మన్‌ పదవిని ఇవ్వాలని పలువురు కూటమి నేతలు, ఉభయదారులు, కాణిపాక వాసులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ చైర్మన్‌కే..చైర్మన్‌ పదవి అంటూ ప్రచారం జరుగుతోంది. కొందరు బడా నేతలు కూడా మాజీకే కుర్చీ అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే కూటమిలోని ఓ వర్గం మాత్రం మాజీకి రాకూడదని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు నేతలు మాజీ చైర్మన్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆ నలుగురు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. తెలిసిన మంత్రులు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేష్‌ వద్ద సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త ముఖాలు తెరపైకి..

ఇన్నాళ్లు ఆ నలుగురే పోటీ అనుకున్నారు. ఇప్పుడు మరో కొంత మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ఐరాల మండలానికి చెందిన ఓ కూటమి నేత పేరు ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ నేత తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నారని, దీంతో ఆ నేత భార్యకు చైర్మన్‌ సీటు అడుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే బెంగుళూరులో స్థిరపడి, ఆర్థికంగా బలపడిన ఓ బడా నేత కూడా తెరపైకి వచ్చారు. ఆ నేత ఇటీవలే అధిష్టానంను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు వారికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చైర్మన్‌ కుర్చీ ఎవరికి ఇస్తారో అని పలువురు ఎదురుచూస్తున్నారు.

బ్రహ్మోత్సవాలకు ముందే..?

కూటమి అధికారంలోకి వచ్చాక ఒక బ్రహ్మోత్సవం ముగిసింది. మరో బ్రహ్మోత్సవానికి ముహూర్తం ఖ రారైంది. కాణిపాకంలో ఆగస్టు 27వతేదీ నుంచి బ్ర హ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లు ఇదిగో..అదిగో అంటూ పాల క వర్గంపై ఆశలు నిరాశలయ్యాయి. పాలకవర్గం ప్ర కటింపు విషయంలో ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంటోంది. బ్రహ్మోత్సవ ప్రారంభం వారానికి ముందు పాలకవర్గ ప్రకటన ఉండబోతుందనే ప్రచారం జ రుగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు తెగ టెన్ష న్‌ పడిపోతున్నారు. చాలా మంది మాజీ చైర్మన్‌కే కు ర్చీ ఇస్తారని బల్లగుద్ది చెబుతున్నారు. అయితే పలువురు కూటమి నేతలు, ఉభయదారులు, అధికారులు ఆర్థికంగా బలమైన నాయకులకు ఇస్తే..ఆలయ అభివృద్ధికి దోహద పడుతుందని భావిస్తున్నారు. ఈ రకంగానే వారి అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందని వారు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement