
అక్రమ కేసుల నుంచి బయట పడాలని పూజలు
కార్వేటినగరం : పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అణచివేత దిశగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల నుంచి త్వరగా బయటకు రావాలని బోయకొండ గంగమ్మకు కార్వేటినగరం మండల నాయకులు బుధవారం పూజలు చేశారు. ఈ సందర్భంగా కొల్లాగుంట ఎంపీటీసీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక సీఎం చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారని, ఇలాంటి అక్రమ కేసులకు ఎవరూ బయపడబోరని, కూటమి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం నేర్పుతారన్నారు. అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఎన్నికలని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలవాలని, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామిని కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను తొలగించడానికి బోయకొండ గంగమ్మ అండగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మునికృష్ణ, మండల కార్యదర్శి నందగోపాల్ శెట్టి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాపూజీరెడ్డి, పంచాయతీ రాజ్ మండల విభాగం ఉపాధ్యక్షుడు జేజేలురెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.