
డిప్యూటీ కమిషనర్ తనిఖీ
శ్రీరంగరాజపురం : మండలంలోని నెలవాయి వద్ద నున్న ఎస్‌ఎన్‌జే డిస్లరీ ఫ్యాక్టరీని జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయకుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్లరీ ఫ్యాక్టరీ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు , సలహాలు అందించారు. ఆయన వెంట ఎకై ్సజ్ అధికారులు, ఫ్యాక్టరీ ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ, ఏజీఎం రవికుమార్, హెచ్‌ఆర్ గిరి పాల్గొన్నారు.
ఇద్దరు సీఐలకు స్థాన చలనం
చిత్తూరు అర్బన్ : జిల్లాలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను (సీఐ) అటాచ్‌మెంట్ ద్వారా బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. వేకెంట్ రిజర్వులో ఉన్న జయరామయ్యను కల్లూరు, అక్కడ పనిచేస్తున్న సూర్యనారాయణను చిత్తూరు స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
2003 డీఎస్సీ టీచర్లకు
పాత పెన్షన్ అమలు చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపజేసేందుకు సీఎం ప్రత్యేక చొరవ చేపట్టాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2003 డీఎస్సీ టీచర్లకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ప్రకారం పాత పెన్షన్ వర్తింపజేయాలన్నారు. 2003 డీఎస్సీ టీచర్లు పాతపెన్షన్‌కు అన్ని విధాల అర్హులైనప్పటికీ నష్టపోతున్నారన్నారు. 20 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పాతపెన్షన్ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే తెలంగాణాలో ఇదే కేటగిరీకి చెందిన టీచర్లు, ఉద్యోగులకు పాతపెన్షన్ అమలు చేయాలని అక్కడి హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. ఏపీలో సైతం సీపీఎస్ అమలు తేదీ సెప్టెంబర్ ఒకటి 2004 కంటే ముందు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రభుత్వ పాలనాపరమైన కారణాలతో సీపీఎస్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నారు. సీఎం స్పందించి ఈ సమస్యను పరిష్కరించి 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

డిప్యూటీ కమిషనర్ తనిఖీ