
ప్రైవేట్ బస్సు ఢీకొని యువకుడి మృతి
శ్రీరంగరాజపురం : మండలంలోని శ్రీరంగరాజపురం సచివాలయం వద్ద బుధవారం రాత్రి ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. జీ.ఎం.ఆర్.పురం ఎస్టీ కాలనీకి చెందిన లోకేష్ (24) ద్విచక్ర వాహనంలో శ్రీరంగరాజపురంలో ఉన్న దౌపదీ ధర్మరాజుల గుడి వద్దకు బయలుదేరాడు. చిత్తూరు – పుత్తూరు జాతీయ రహదారిలోని శ్రీరంగరాజపురం గ్రామ సచివాలయం వద్ద ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించినట్లు తెళిపారు.