
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
– 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
గుడుపల్లె : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. మంగళవారం గుడుపల్లె పోలీస్ స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. మంగళవారం పీఈఎస్ మెడికల్ కళాశాల వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నంబరు ప్లేట్లు లేని వాహనాలు వేగంగా వస్తుండడంతో పట్టుకుని విచారించామన్నారు. ఇందులో తమిళనాడుకు చెందిన అరుణ్‌కుమార్, హరి, మోహన్, మణిగండన్, ముకేష్, దినేష్ అనే ఆరుగురు ముఠా సభ్యులు పట్టుబడ్డారన్నారు. వీరిని విచారించగా వివిధ ప్రదేశాలలో 18 ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గుడుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బందికి ప్రోత్సాకాలు అందించారు. వాహనాల యాజమానులను గుర్తించి వారికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు మల్లేష్‌యాదవ్, శంకరయ్య, ఎస్‌ఐలు శ్రీనివాసులు, నరేష్, వెంకట మోహన్ పాల్గొన్నారు.
చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు
బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లెలో ఇటీవల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్‌ఐ పరశురాముడు పేర్కొన్నారు. బైరెడ్డిపల్లెకు చెందిన మహేష్ అలియాస్ మాలిక్ పుంగనూరు రహదారిలో దుస్తుల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడన్నారు. సమీపంలోని దుకాణాల్లో రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతుండటంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వివరించారు. ఈనెల 23, 26 తేదీల్లో ఏఎన్ ప్యాన్సీ స్టోర్‌లో రూ.10 వేలు, గాయిత్రీ టీ దుకాణంలో వెండి, బంగారం చోరీ చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వివరాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద చోరీ చేసిన వస్తువులను రికవరీ చేసినట్లు చెప్పారు.

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు