
నూతన రోడ్డు ప్రారంభం
చిత్తూరు కార్పొరేషన్ : రూ.5 కోట్ల వ్యయంతో నగరంలోని అంబేడ్కర్ భవన్ నుంచి జ్యోతిరావ్ పూలే భవనం వరకు 3.01 కిలోమీటర్ రోడ్డును మంగళవారం కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం కావడంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. కట్టమంచి బైపాస్ రోడ్డు పనులకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభించనున్నామన్నారు. వీటితో పాటు కొంగారెడ్డిపల్లె, కట్టమంచి, హైరోడ్డు, ఇరువారం రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా ప్రమాదాల జోన్‌లో ఉంది : దేశంలో ప్రమాదాలు జరుగుతున్న టాప్ 100 జిల్లాలో చిత్తూరు జిల్లా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రయాణాల్లో హెల్మెట్ వాడాలని ఎంత చెబుతున్నా ఎవరూ పాటించడం లేదన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 300 మందికి పైగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్ అముద, పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్ నరసింహప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.

నూతన రోడ్డు ప్రారంభం