
పోష్ చట్టంపై విస్తృత అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారానికి అమలు చేస్తున్న పోష్ చట్టంపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి ఆధ్వర్యంలో పోష్ చట్టానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోష్ చట్టం అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. రెగ్యులర్, పార్ట్‌టైమ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ చట్టాన్ని వివరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
బోయకొండ హుండీ ఆదాయం రూ.77.83 లక్షలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.77.83 లక్షలు వచ్చినట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. ఈ మేరకు సోమవారం హుండీ లెక్కింపు చేపట్టగా నగదు రూ.77,83,633, బంగారం 21 గ్రాములు, వెండిి 394 గ్రాములు వచ్చినట్టు పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీ నోట్ల తోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.57,057 నగదు లభించినట్లు వెల్లడించారు. ఈ ఆదాయం 35 రోజులకు సమకూరిందన్నారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఉపేక్షించొద్దు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా సరిహద్దు రాష్ట్రాలకు దగ్గరగా ఉండడంతో ఇటువైపు ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలు రావడానికి వీల్లేదని చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు–వేలూరు రోడ్డులోని నరహరిపేట వద్ద ఉన్న ఎకై ్సజ్ శాఖ చెక్‌పోస్టును ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. నాటుసారా, గంజాయి, కల్తీ మద్యం లాంటివి ఏవీ కూడా జిల్లాలోపలకు రావడానికి వీల్లేదన్నారు. నిత్యం అధికారులు తనిఖీలను ముమ్మరం చేయడం ద్వారానే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. డీసీ వెంట సీఐ రవికుమార్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
జీవన ఎరువులతో
ఆరోగ్యకరమైన పంటలు
బంగారుపాళెం: ఆరోగ్య కరమైన పంట దిగుబడికి రైతులు జీవన ఎరువులు వినియోగించాలని జిల్లా వనరుల కేంద్రం ఏఓ లక్ష్మీప్రసన్న సూచించారు. సోమవారం మండలంలోని చీకూరుపల్లెలో పంటల సాగులో తీసుకోవాల్సి జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ పంటల సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడి కోసం సేంద్రియ పద్ధతులను అనుసరించాలని చెప్పారు. అనంతరం రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. బంగారుపాళెం ఏఓ భారతి, సిబ్బంది సాయిజ, కుమార్ పాల్గొన్నారు.
3 నుంచి జిల్లా స్థాయి చెస్ పోటీలు
నగరి : జిల్లా స్థాయి చెస్ పోటీలు ఆగస్టు 3 నుంచి నిర్వహించనున్నట్టు లయన్స్ క్లబ్ జిల్లా చైర్‌పర్సన్ ప్రభాకర్‌రాజు తెలిపారు. మండలంలోని వీకేఆర్‌పురం సమీపంలో గల హైవే గ్రాండ్ వోల్డ్ నందు ఈ పోటీలు జరుగుతాయన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం, 28వ చెస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అండర్ 9, అండర్ 16, అబౌవ్ 16 కేటగిరిలలో పోటీలు జరుగుతాయని, వివరాలకు 9440821444లో సంప్రదించాలని సూచించారు.

పోష్ చట్టంపై విస్తృత అవగాహన

పోష్ చట్టంపై విస్తృత అవగాహన

పోష్ చట్టంపై విస్తృత అవగాహన