
‘హిమ’విజయం!
పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలానికి చెందిన హిమసాగర్ పట్టుదలకు మారుపేరుగా నిలిచారు.
పోలీసు గ్రీవెన్స్‌కు
36 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 36 ఫిర్యాదులు అందాయి. సోమవారం ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధింపులు, డబ్బు తగాదాలు, భూ తగాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించినవి ఉన్నాయి. వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి వాటిని పరిష్కరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అలాగే పలువురు పోలీస్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి, బాధితుల సమస్యలపై చర్చించారు. ఇక డీటీసీ డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు.
3న బాల్‌బ్యాడ్మింటన్
జిల్లా జట్ల ఎంపిక
శ్రీకాళహస్తి: పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో ఆగస్టు 3వ తేదీ ఉదయం 8 గంటలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు జనవరి 2, 2010 తరువాత జన్మించి ఉండాలన్నారు. సెలెక్షన్‌కు వచ్చే క్రీడాకారులు తమ వెంట ఆధార్, బ్లడ్ గ్రూప్ తప్పని సరిగా తీసుకురావాలన్నారు. డ్రెస్‌కోడ్ పాటించాలని తెలిపారు. ఎంపికలో చిత్తూరు జిల్లా బాల్‌బ్మాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటస్వామి, చైర్మన్ జగన్నాథంనాయుడు, అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. మరిన్ని వివరాలకు 7013754776, 9848295471 నంబర్లలో సంప్రదించాలన్నారు.
– 8లో