
భావి ఇంజినీర్లుగా ఎదగాలి
ఏర్పేడు : తిరుపతి ఐఐటీలో నూతనంగా బీటెక్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు బాగా చదువుకుని భావి ఇంజినీర్లుగా ఎదగాలని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆకాంక్షించారు. సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో యువంతర్– 2025 ఓరియంటేషన్ నిర్వహించారు. డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త విద్యార్థులకు సంస్థ సంస్కృతి, విద్యా చట్టం, సౌకర్యాలను వివరించారు. ఈ ఏడాది మొత్తం 254 మంది విద్యార్థులు బీటెక్ ప్రవేశం పొందినట్లు వెల్లడించారు. విద్యా వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రామకష్ణ గోర్తి మాట్లాడుతూ విద్యాసంస్థ నిబంధనలను వివరించారు. విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఎన్ ఎన్ మూర్తి మాట్లాడుతూ కళాశాల జీవితం, విద్యార్థుల సౌకర్యాలు, అందుబాటులో ఉన్న పాఠ్యేతర అవకాశాలను తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,486 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.85 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారికి 12 గంటలు పడుతోంది.