
పంటలపై ఏనుగుల దాడి
పలమనేరు: కుంకీ ఏనుగులు వచ్చి ఏమి చేస్తాయోగాని కౌండిన్య అడవిలోని మదపుటేనుగులు రైతుల పొలాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఆమేరకు ఇప్పుడు అటవీశాఖ కుంకీ ఎలిఫెంట్ క్యాంపు ఏర్పాటు చేసిన గ్రామమైన ముసలిమొడుగులోనే ఏనుగులు పలువురు రైతుల మామిడితోటల్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆపై తోటలోని కొమ్మలను విరిచి కాయలను ఆరగించి నష్టాన్ని కలిగించాయి. గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌నాయుడికి వీటి కారణంగా నష్టం కలిగింది. దీంతో స్థానిక ఫారెస్ట్ సిబ్బంది పంట నష్టాన్ని అంచనా చేసి నష్టపరిహారంకోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.