ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం | - | Sakshi
Sakshi News home page

ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం

Jul 28 2025 8:01 AM | Updated on Jul 28 2025 11:05 AM

● ఈనె

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●

సూళ్లూరుపేట : తిరుపతి జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 5.40 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎ్‌ఫ్‌16 రాకెట్‌ ద్వారా 2,392 కిలోల బరువు కలిగిన నిసార్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగ సమయానికి 25 గంటల ముందు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహాన్ని 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

మూడు దశల్లో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌16 ప్రయోగం

పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మూడు దశల్లోనే ప్రయోగిస్తారు. 51.7 మీటర్లు పొడవు ఉన్న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలు దేరుతుంది. ఈ ప్రయోగంలో 2,392 కిలోలు బరువు గల నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ (వ్యాబ్‌)లో రాకెట్‌ అనుసంధానం పూర్తి చేసి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు రాకెట్‌ను వ్యాబ్‌ నుంచి ప్రయోగ వేదిక మీదకు నెమ్మదిగా తరలించే ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ను దశల వారీగా అనుసంధానించే దృశ్య మాలిక ఇది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 సిరీస్‌లో 18వ ప్రయోగం కావడం విశేషం. షార్‌ కేంద్రం నుంచి 102వ ప్రయోగం కావడం విశేషం.

మూడో దశ ఇలా

మూడో దశను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రపోల్షన్‌ సెంటర్‌లో రూపొందించి, అందులో 14.5 టన్నుల క్రయోజనిక్‌ ఇంధ నాన్ని నింపి మూడోదశను పూర్తి చేస్తారు. ఈ దశకు పైభాగంలోనే ఉపగ్రహాన్ని అమర్చుతారు.

రెండో దశ ప్రక్రియ

రెండో దశలో 42.1 ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఈ దశలో ఇంధనాన్ని కౌంట్‌డౌన్‌ సమయంలోనే నింపే ప్రక్రియను చేపడతారు.

మొదటి దశ ఇలా

కోర్‌ అలోన్‌ దశలో 138.1 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. రాకెట్‌కు చుట్టూ నాలుగు స్ట్రాపాన్‌ బూస్టర్లుకు కలిపి 170.7 టన్నుల ద్రవ ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు.

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ  ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●1
1/5

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ  ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●2
2/5

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ  ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●3
3/5

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ  ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●4
4/5

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ  ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●5
5/5

● ఈనెల 30న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 రాకెట్‌ నుంచి ప్రయోగం ●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement