
నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టుకు దాతలు నగదు విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన దాతలు కృష్ణమోహన్, పార్థసారథినాయుడు నిత్యాన్నదానానికి రూ.2 లక్షల నగదు విరాళంగా అందించారు. అలాగే గోసంరక్షణ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన పుష్పలత, శివప్రసాద్ రూ.లక్ష విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చూశారు.
రోడ్డు ప్రమాదంలో
గీత కార్మికుడి మృతి
నగరి : పురపాలక పరిధిలోని ఏఎన్ కండ్రిగ కాలనీ మలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.విజేంద్ర (62) అనే గీతకార్మికుడు మృతి చెందాడు. వివరాలు.. ఏఎన్ కండ్రిగ నుంచి విజేంద్ర సైకిల్‌పై బుగ్గ దేవాలయానికి వెళుతుండగా ఎదురుగా ఇటుకల లోడ్డుతో వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దీంతో విజేంద్ర అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ విక్రమ్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విజేంద్ర వైఎస్సార్‌సీపీ కార్యకర్త కావడంతో పార్టీ శ్రేణులు హుటాహుటిన ఘటనా స్థలానికి, ఆస్పత్రికి చేరుకున్నాయి.
దళితులపై దాడులకు
నిరసనగా ‘యాత్ర’
చిత్తూరు రూరల్(కాణిపాకం): దళితులపై దాడులకు నిరసనగా ఆగస్టు 3వ తేదీన కుప్పం నుంచి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడుతున్నట్లు రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. రిజర్వేషన్లు కనుమరుగుతన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ పరమవుతున్నాయని మండిపడ్డారు. ఈనేపథ్యంలో ఎస్సీ జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేయా లని కోరారు.‘రాజ్యాంగ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. నేతలు దాసరి చెన్నకేశవ, మహాసముద్రం కృష్ణయ్య, పార్థసారథి వెంకటగిరి దాము, ఉదయ్ కుమార్, సీజీ దాసు పాల్గొన్నారు.

నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టుకు విరాళం