
త్యాగాలు మరువలేనివి
● ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ ● మాజీ సైనికులకు సత్కారం
చిత్తూరు కలెక్టరేట్ : దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎన్నటికీ మరువలేనివని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికా రి రాఘవులు అన్నారు. శనివారం కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ, మాజీ సైనికులకు సత్కారం చేశారు. అనంతరం గాంధీబొమ్మ నుంచి అమర్ జవాన్ స్థూపం వరకు ర్యాలీ చేసి, అమరవీరులకు నివాళులర్పించారు.
తరువాత కార్గిల్ యుద్ధంలో పా ల్గొన్న సైనికులు, మాజీ సైనికులను సత్కరించారు. మాజీ సైనికులు పళని, రాజన్, సూపరింటెండెంట్ రజాఖ్ ఖాన్, వెల్ఫేర్ ఆర్గనైజర్ వినా యకరెడ్డి, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో..
నగరంలోని నెహ్రూ యవకేంద్రం ఆధ్వర్యంలో స పోర్ట్ కార్యాలయం ఆవరణలో కార్గిల్ విజయ్ ది వస్ నిర్వహించారు. జిల్లా యువజన అధికారి ప్ర దీప్ కుమార్, యువభారత్ ప్రాంతీయ గణాంక అ ధికారి బాబురెడ్డి మాట్లాడారు. అనంతరం మొక్క లు నాటారు. కెప్టెన్ మనోజ్‌కుమార్ పాండే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుమార్, జోషప్ రా జు, రాజకుమారి, వహీదా, హరీష్ పాల్గొన్నారు.