
రైతు పొలంలో కొండచిలువ
వి.కోట: ఓ రైతు వ్యవసాయ పొలంలో కొండచిలువ హాల్‌చల్ చేయడంతో రైతులు భయంందోళనకు గురైన సంఘటన వి.కోట మండలం కొడగళ్లు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. రైతుల కథనం మేరకు.. కొడగళ్లు గ్రామంలోని భార్గవ్ మల్బరి తోటలో రైతుకు కొండచిలువ కనిపించింది. దీంతో భయందోళనకు గురై ఆయన పరుగులు తీశాడు. పొరుగున ఉన్న రైతులకు ఈ విషయం తెలిపాడు. అనంతరం మండలంలోని పెద్ద్దరాంపల్లి గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ రాజ్‌కూమార్‌కు సమాచారం అందించారు. ఆయన ఘటన స్థలానికి చేరుకుని దాదాపు 9 అడుగులు ఉన్న కొండచిలువను చాకచాక్యంగా పట్టుకుని కొమ్మరమడుగు అటవీ ప్రాంతంలో విడిచి పెట్టిన్నట్లు రైతులు తెలిపారు.
నల్లమందు తిని ఆవుకు గాయాలు
పులిచెర్ల(కల్లూరు) : అడవి పందుల కోసం ఏర్పా టు చేసిన నల్లమందు ఉండలను నమిలిన ఆవు తీ వ్రంగా గాయపడింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని 102 ఇ రామిరెడ్డిగారిపల్లె పంచాయ తీ చిగరమాకులపల్లెకు చెందిన రైతు మల్లికార్జున శనివారం తన ఆవును మేత కోసం పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ వేటగాళ్లు ఉంచిన నల్లమందు ఉండలను ఆవు నమిలింది. దీంతో ఆవు నోరు ఛిద్రమైంది. బాధితుడు లబోదిబోమంటున్నాడు.