
ఆశా ఇంటర్వ్యూలకు 142 మంది హాజరు
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆశా కార్యకర్తల ఇంటార్వ్యూలు నిర్వహించారు. మొత్తం 69 పోస్టులకు 174 మంది దరఖాస్తు చేసుకోగా 142 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరందరికి డీఎంహెచ్‌ఓ సుధారాణి సమక్షంలో ఇంటార్వ్యూ చేశారు. రెండు రోజుల్లో కలెక్టర్ ఆదేశాలతో ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని ఆమె తెలిపారు. ఆశ నోడల్ అధికారి హనుమంతరావు, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, అధికారులు ప్రవీణ, గిరి, రమేష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.