
ఆహార ఉత్పత్తుల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి
తిరుపతి సిటీ: ఎస్వీయూ హోమ్‌సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తుల పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని వీసీ సీహెచ్ అప్పారావు తెలిపారు. వర్సిటీలోని సెనేట్ హాల్‌లో గురువారం ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, డైటిక్స్ –ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్ విభాగాలు సంయుక్తంగా అప్లికేషన్స్ ఆఫ్ టెక్చర్ అనాలిసిస్ ఇన్ ఫుడ్ సైన్స్ అన్న అంశంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఇందులో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని వర్క్‌షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ విభాగాన్ని, ఆహార ఉత్పత్తి పరిశ్రమలను అనుసంధానం చేస్తామన్నారు. యూఎస్‌లోని పూర్వడా వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, రాగిణి శర్మ మాట్లాడుతూ మానవ శారీరక నిర్మాణానికి అవసరమైన ఆహారం, నీరు, పోషకాల ప్రాధాన్యతను వివరించారు. రిజిస్ట్రార్ భూపతినాయుడు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మావతి, ప్రొఫెసర్ మంజుల, కేవీ సుచరిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.