ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి

Jul 25 2025 4:45 AM | Updated on Jul 25 2025 4:45 AM

ఎంఎస్

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి

బ్రహ్మోత్సవ పనులు
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులు టీటీడీ ప్రారంభించింది. విద్యుద్దీపాలంకరణ పనులకు శ్రీకారం చుట్టింది.
ఉన్నత విద్య బలోపేతానికి కృషి

శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025

మహిళకు వైద్యపరీక్షలు (ఫైల్‌)

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ముంచుకొస్తోంది. అవగాహన లోపంతో మహిళలను ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ వ్యాధి ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన అబలలనే బలితీసుకుంటోంది. ఉచిత టీకాల విషయంపై ఎవరూ నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది.

27న ఫుట్‌బాల్‌ సెలెక్షన్స్‌

పలమనేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన జిల్లా స్థాయి మెన్‌ ఫుట్‌బాల్‌ సెలెక్షన్స్‌ నిర్వహించనున్నట్టు జిల్లా ఫుట్‌బాల్‌ సంఘ నేతలు హేమంత్‌రెడ్డి, కిశోర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో పాల్గొనే విద్యార్థులు రిజిస్ట్రేషన్ల కోసం 8712139311 నంబరుకు ఫోన్‌ చేయాలని వారు సూచించారు.

స్లో మోటార్‌ సైకిల్‌

రైడింగ్‌ పోటీలు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులోని సాయుధ దళం కార్యాలయ మైదానంలో 100 మీటర్ల స్లో మోటార్‌ సైకిల్‌ రైడింగ్‌ నిర్వహించనున్నట్టు ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు తెలిపారు. ఆసక్తి గల వారు శనివారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులుంటాయన్నారు. 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్‌ లైసెన్స్‌, పెండింగ్‌ చలానాలు ఉండని వ్యక్తులు అర్హులని ఆయన పేర్కొన్నారు.

27న జిల్లా స్థాయి

యోగాసన పోటీలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని మెసానికల్‌ మైదానంలో ఈనెల 27న జిల్లా స్థాయిలో నిర్వహించే యోగాసన పోటీలను అర్హులు, ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యుక్తాచౌదరి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పోటీల్లో గెలుపొందే మొదటి బహుమతి విజేత రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 6303899780, 9985407782 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఇంజినీరింగ్‌ తొలి విడత

అడ్మిషన్లు ప్రారంభం

సోమవారం నుంచి

రెండో విడత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ

తిరుపతి సిటీ : ఎట్టకేలకు ఇంజినీరింగ్‌ తొలి విడత అడ్మిషన్ల జాబితా బుధవారం విడుదల కావడంతో ఇంజినీరింగ్‌ కళాశాలలు కోలాహలం నెలకొంది. తొలి విడత సీట్లు సాధించిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో గురువారం రిపోర్ట్‌ చేసి అడ్మిషన్లు పొందారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్‌, అటానమస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడిగా మారాయి. తొలిరోజు 56 శాతం మేర విద్యార్థులకు అడ్మిషన్లు పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 27వ తేదీ వరకు తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అలాగే రెండో విడత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇటీవల సిబ్బంది ఎన్‌సీడీ సర్వే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 5,92,514 కుటుంబాలు ఉండగా 5,03,311 కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో కొంత మేర సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు బయటపడ్డాయి. 18 ఏళ్లు దాటిన వారు 15,67,268 మంది ఉంటే 11,24,511 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. ఇందులో 273 మందికి ఓరల్‌ క్యాన్సర్‌, 218 మందికి రొమ్ము క్యాన్సర్‌, 203 మందికి సర్వైకల్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇక అవగాహన రాహిత్యంతో సర్వైకల్‌ క్యాన్సర్‌ను గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి వారు వివిధ కారణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడంతో కేసులు బయటపడుతున్నాయి.

సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాప్తి ఇలా...

సర్వైకల్‌ క్యాన్సర్‌ సోకడానికి ప్రధాన కారణం ‘హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ)’. ఎక్కు వ మంది భాగస్వాములతో శృగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కొన్నేళ్ల తర్వాత వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ రోగుల్లో, కొన్ని రకాల మందులు తరచూ వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా కూడా సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది. చిన్న వయసులో శృంగారంలో పాల్గొనడం వల్ల హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే బాల్య వివాహాలు చేసుకునే వారిలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు ఏళ్ల తరబడి వాడినా సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఈ క్యాన్సర్‌ ముప్పును పెంచుతుంది. వీటితో పాటు ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్యంగా కూడా కొంతమందిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ కేసులు అత్యధికంగా పేద కుటుంబాల్లోని మహిళల్లోనే వెలుగుచూస్తున్నాయి.

వ్యాక్సినేషన్‌ మాటేమిటో?

ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్‌. ప్రస్తుతం 9–26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 19–14 ఏళ్ల లోపు బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌బారిన పడకుండా వ్యాక్సినేషన్‌ను పోత్సహిస్తామని ప్రకటించింది. దీని ధర మార్కెట్లో రూ.2వేల వరకు ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. విడతల వారీగా ఈ వ్యాక్సినేషన్‌ను వేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ వేయించుకునే స్థోమత పేద, మధ్యతరగతి కుటుంబాల్లో లేదు. ఈ కారణంగా ప్రభుత్వమే వ్యాక్సిన్‌ను మహిళలకు ఉచితంగా అందించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికితోడు క్షేత్ర స్థాయిలో సర్వైకల్‌ క్యాన్సర్‌పై సరైనా అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు ఈ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే క్యాన్సర్‌ నివారణ తొలి దశలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

– పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి

తిరుపతి మంగళం : ఎంఎస్‌ఎంఈలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఆయన పార్లమెంటులో తిరుపతి జిల్లా నుంచి ఏవైనా ఎంఎస్‌ఎంఈ యూనిట్లను గుర్తించారా? అలాగే ఎగుమతిదారులకు ఆర్థిక మద్దతు, క్రాస్‌–బోర్డర్‌ ఫ్యాక్టరింగ్‌, విదేశీ మార్కెట్లలో నాన్‌–టారిఫ్‌ అడ్డంకులను అధిగమించడంలో సహాయం పొందారా..? అంటూ ఎంపీ ప్రశ్నించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి గురువారం ఆయన పార్లమెంటులో కీలక ప్రశ్నను లేవనెత్తారు. కేంద్ర బడ్జెట్‌ 2025–26లో ప్రకటించిన ఎగుమతుల ప్రోత్సాహం మిషన్‌ అమలులో భాగంగా ఎగుమతుల ప్రోత్సాహ మిషన్‌ను వాణిజ్య, ఎంఎస్‌ఎంఈ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయని, వాణిజ్య విభాగం ప్రధాన నోడల్‌ శాఖగా పనిచేస్తోందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఆర్థిక సంవత్సరాలలో ఈ పథకం కింద 7 ఎంఎస్‌ఎంఈలకు రూ.16 లక్షల ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. తిరుపతి వంటి అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి పట్టణాలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ఎంఎస్‌ఎంఈలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ మద్దిల గురుమూర్తి సభలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఆర్థిక సంవత్సరాలలో కేవలం 7 ఎంఎస్‌ఎంఈ సంస్థలకు రూ. 16 లక్షల ఆర్థిక సాయం మాత్రమే అందించడం శోచనీయమని ఎంపీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈ లను ప్రోత్సహిస్తే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్‌ చేశారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉన్నత విద్య బలోపేతానికి అధ్యాపకులు కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుల సర్వీస్‌ కొనసాగింపునకు ఆమె కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సర్వీస్‌ కొనసాగింపునకు అర్హత ఉన్న ఒప్పంద అధ్యాపకుల సర్టిఫికెట్లను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సర్వీస్‌లో కొనసాగింపు అవుతున్న ఒప్పంద అధ్యాపకులు డిగ్రీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 50 మంది ఒప్పంద అధ్యాపకులను 2025–26 సంవత్సరానికి కొనసాగించే ప్రక్రియను చేపట్టారు. వైస్‌ ప్రిన్సిపల్‌ నాగేంద్ర, పలు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు మనోహర్‌, విజయేలురెడ్డి, వేణుగోపాల్‌, షణ్ముగం, చిదంబరం, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

– 8లో

న్యూస్‌రీల్‌

జిల్లాలో పెరుగుతున్న

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌

(సర్వైకల్‌ క్యాన్సర్‌)

సర్వేలో వెలుగుచూస్తున్న కేసులు

కొందరు క్యాన్సర్‌ను దాచిపెడుతున్న వైనం

ఈ వ్యాధి నివారణకు

అవగాహన కల్పిస్తే ఒట్టు

ఉచిత వ్యాక్సిన్‌ ఊసెత్తని ప్రభుత్వాలు

వ్యాధి లక్షణాలు

రుతుక్రమంలో సమస్యలు

యోని నుంచి రక్తస్రావం

లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం

పీరియడ్స్‌ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం

యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం

మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు

పొత్తికడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలు

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి1
1/6

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి2
2/6

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి3
3/6

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి4
4/6

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి5
5/6

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి6
6/6

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement