
ఎంపీ అక్రమ అరెస్టు.. కూటమి కుట్ర
శ్రీకాళహస్తి : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం, గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ లబ్ధి కోసం అరెస్టు చేయడం దారుణమని, కూటమి కక్ష పూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవన్నారు. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే కాలం దగ్గర్లో ఉందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను చంద్రబాబు గుర్తు చేసుకోవాలని రానున్న రోజుల్లో కూటమికి డిపాజిట్లు కూడా రావని తెలిపారు. ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజలను గాలికి వదిలేసి తన సినిమా రేట్లు పెంచుకొని దీని కోసమే రాజకీయాలకు వచ్చానని చెప్పడం చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వస్తున్న జనాధరణను చూసి ఓర్వలేక అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాం వాసుదేవ నాయుడు, ఏర్పేడు మండల ఇంచార్జ్ గున్నేరీ కిషోర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్, మున్నా రాయల్, జయ శ్యామ్ రాయల్,కంఠ ఉదయ్ కుమార్,మస్తాన్, యువజన విభాగం అధ్యక్షులు, నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు.