
అక్రమ అరెస్ట్‌లతో..
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే చింతల ధ్వజమెత్తారు.
●
వ్యాక్సిన్ ఉంది
గంటకు దేశంలో 9 మంది సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. ఇప్పటి వరకు 80వేల మంది మరణించారు. కొత్త కేసులు 1.70 లక్షలు ఉన్నాయి. ఇలానే వదిలేస్తే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అన్ని క్యాన్సర్లకంటే..ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు మాత్రమే వ్యాక్సిన్ ఉంది. ఈ క్యాన్సర్ నివారణకు ఏళ్ల లోపు పిల్లలకు 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. 35–45 సంవత్సరాల లోపు మహిళలకు 70 శాతం స్క్రీనింగ్ పరీక్షలు అయి ఉండాలి. బాధితులు కచ్చితంగా మెరుగైన వైద్యం చేయించుకోవాలి. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వల్ల 80శాతం కేసులను నివారించవచ్చు.
– ఆశ్రీత, వైద్య నిపుణులు
గ్రామాల్లోనే అధికం
గ్రామాల్లోనే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్యాన్సర్‌ను పాప్ స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మరణాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ముప్పును తప్పించుకోవాలంటే మన శరీరంపై అవగాహన ఉండాలి. ఏ మాత్రం మార్పు కనిపించినా దాన్ని గుర్తించాలి. శరీరంలో నొప్పి లేని గడ్డలు ఏమి కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దు. తక్షణం వైద్యులను సంప్రదించాలి.
– ఉషశ్రీ, సూపరింటెండెంట్,
జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు
ముందే గుర్తిస్తే మేలు
సర్వైకల్ క్యాన్సర్ దాచిపెడితే ప్రాణానికే ప్రమాదం. ఇందులో దాపరికాలు వద్దు. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పరీక్షలు చేయించాలి. నిర్థారణ అయితే సరైనా చికిత్స తీసుకోవాలి. బయపడాల్సి పనిలేదు. దీనికి తోడు కౌమార దశలో బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాధిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
– సుధారాణి, డీఎంఅండ్ హెచ్‌ఓ, చిత్తూరు
– 8లో

అక్రమ అరెస్ట్‌లతో..

అక్రమ అరెస్ట్‌లతో..