
కక్ష సాధింపుతోనే..
కేవీబీపురం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని వైఎస్సార్‌సీపీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ కేవీబీపురం మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి నూకతోటి రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేయలేక వాటిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు నీరుపోసి పెంచి పోషిస్తున్న కేసులే రేపటి రోజున వారిని చుట్టు ముట్టి ఊపిరాడనీయకుండా చేస్తాయని హెచ్చరించారు. టీడీపీ కవ్వింపు చర్యల పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని రాజేష్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు గవర్ల కృష్ణయ్య, ధనుంజయరెడ్డి, బొర్రా మాధవీరెడ్డి, లాల్‌బాబుయాదవ్, దశరథరామిరెడ్డి, చందురెడ్డి, నంద కుమార్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీలు అయ్యప్పరెడ్డి, సర్పంచ్ గిరిబాబు, మైనారిటీ సెల్ నేతలు, బీసీ సెల్ నేతలు పాల్గొన్నారు.