
● ప్రతి నెలా బడి బియ్యంను కి.మీ. దూరం మోసుకెళ్తున్న టీచ
విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన టీచర్లు.. బడి బియ్యం మూటలు మోయలేక అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి అందించే బియ్యం బస్తాలు క్లస్టర్ పాఠశాలల వద్ద అధికారులు దించేస్తున్నారు. అక్కడి నుంచి ఆయా పరిధిలోని పాఠశాలలకు టీచర్లు ప్రతి నెలా బియ్యం మూటలను మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నిబంధనల మేరకు ప్రతి నెలా ఆయా పాఠశాలల వద్దకే మధ్యాహ్న భోజన బియ్యం తీసుకురావాల్సి ఉండగా కేవలం క్లస్టర్ కేంద్రాల వద్దే దింపేస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్లతో కూటమి ప్రభుత్వం బియ్యం మూటలు మోపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వింత ధోరణి కూటమి పాలనలో అమలవుతోంది. గత ఏడాదిగా జిల్లాలోని సీఆర్‌సీ (క్లస్టర్ రీసోర్స్ సెంటర్) నుంచి ఆ పరిధిలోని ఇతర పాఠశాలలకు బియ్యం మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను క్షేత్ర స్థాయిలోని హెచ్‌ఎంలు, టీచర్లు ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేని పరిస్థితి. దీంతో ప్రతి నెలా హెచ్‌ఎంలు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్ల చేత కూటమి ప్రభుత్వం బియ్యం మూటలు మోయించడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
148 సీఆర్‌సీల పరిధిలో సమస్యలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,460 పాఠశాలల్లో 148 ఉన్నత పాఠశాలలను సీఆర్‌సీ (క్లస్టర్ రీసోర్స్ సెంటర్) గా ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేసిన 148 సీఆర్‌సీ కేంద్రాల్లో ఒక్కో సీఆర్‌సీ పరిధిలో దాదాపు 17 నుంచి 25 పాఠశాలల వరకు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 148 సీఆర్‌సీల నుంచి ప్రతి నెలా టీచర్లు బియ్యం మూటలు మోసుకెళ్తున్నారు. ఈ సమస్యపై క్షేత్రస్థాయిలో టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
పనిభారం
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లను సమగ్రశిక్ష శాఖ పరిధిలో చిరు జీతాలకు పనిచేస్తున్న సీఆర్‌పీలను కూటమి ప్రభుత్వం శ్రామికులుగా మార్చేసింది. వింత నిర్ణయాలను అమలు చేస్తూ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. గత ఐదేళ్ల పాటు అభివృద్ధి బాటలో ముందుకెళ్లిన విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వంలో వెనుకబడుతోంది. అసలే పాఠశాలల్లో యాప్‌లు, వివిధ కార్యక్రమాల పేరుతో టీచర్లను ఇబ్బందులు పెడుతున్న విషయం విధితమే. దీంతో పాటు ప్రతి నెలా టీచర్లను బియ్యం మూటలను మోసుకెళ్లే దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని టీచర్లు భగ్గుమంటున్నారు.
విద్యావ్యవస్థ విచ్ఛిన్నం
కూటమి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ విచ్ఛినం అయ్యింది. రాష్ట్ర స్థాయిలో అధికారులు చేపడుతున్న ప్రణాళికలు, విద్యాసంబంధ చర్యలు ప్రాథమిక విద్యను బలహీనపరుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉండే టీచర్ల సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రతి నెలా టీచర్లు కి.మీ దూరంలో ఉండే పాఠశాలలకు సీఆర్‌సీ కేంద్రం నుంచి బియ్యం మూటలు ఎలా తీసుకెళ్తారు. అటీవి ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు బియ్యం మూటలు తీసుకెళ్లలేక టీచర్లు అవస్థలు పడుతున్నారు. అసలే కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యాప్‌లు, ఆన్‌లైన్ పనులకు, జూమ్ మీటింగ్‌లకు వ్యతిరేకంగా త్వరలోనే టీచర్లు రోడ్డు ఎక్కే పరిస్థితి కనపడుతోంది. బియ్యం మోసుకెళ్లే సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించాలి.
– రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్
సివిల్ సప్‌లైస్ డీటీ, ఎంఈవో–2లపై ఆరోపణలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల వద్దకు మధ్యాహ్న భోజనం బియ్యం మూటలను దించాల్సిన బాధ్యత సివిల్ సప్‌లైస్ డీటీలపై ఉంటుంది. ప్రతి మండలంలో బియ్యం గోడౌన్ ఇంచార్జీలగా ఉండే సీఎస్‌డీటీలకు పాఠశాలల వద్దకు బియ్యం దింపేందుకు గాను ప్రభుత్వం కి.మీ చొప్పున ప్రత్యేక రవాణా చార్జీలను ఇస్తోంది. అదే విధంగా ప్రతి పాఠశాల వద్దకే బియ్యం సరఫరా చేయాలనే నిబంధన ఉంది. కాగా జిల్లాలో ఈ నిబంధన ఏ మండలంలోనూ అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎంఈవో–2, గోడౌన్ ఇంచార్జిలుగా ఉండే సివిల్ సప్‌లైస్ డీటీలు కుమ్మకై ్క రవాణా చార్జీలను నొక్కేసేందుకు సీఆర్‌సీ కేంద్రాలను బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

● ప్రతి నెలా బడి బియ్యంను కి.మీ. దూరం మోసుకెళ్తున్న టీచ

● ప్రతి నెలా బడి బియ్యంను కి.మీ. దూరం మోసుకెళ్తున్న టీచ

● ప్రతి నెలా బడి బియ్యంను కి.మీ. దూరం మోసుకెళ్తున్న టీచ

● ప్రతి నెలా బడి బియ్యంను కి.మీ. దూరం మోసుకెళ్తున్న టీచ