
న్యాయం కోసమే ‘శక్తి వారియర్స్’
చిత్తూరు అర్బన్ : న్యాయం కోసం నిలబడే ధైర్యాన్ని పిల్లలు, యువతలో నింపడానికి ‘శక్తి వారియర్స్‌ూ పేరిట బృందాలను ఏర్పాటు చేయాలని అనంతపురం ఐజీ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో మాట్లాడారు. చిత్తూరు పోలీసు అతిథి గృహం నుంచి ఎస్పీ మణికంఠ, అధికారులు పాల్గొన్నారు. ఐజీ మాట్లాడుతూ.. మహిళలు–పిల్లల రక్షణపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. పోక్సో కేసులు కోర్టుల్లో చార్జ్‌షీట్లను త్వరగా వేయాలన్నారు. లైంగిక వేధింపుల నేరాల్లో 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. అనంతరం ఐజీ ప్రస్తావించిన అంశాలపై ఎస్పీ జిల్లాలోని పోలీసులతో సమీక్షించారు.
నిందితుని ఆచూకీ తెలిపితే రూ. 5లక్షలు నజరానా
వరదయ్యపాళెం: తమిళనాడులో సంచలనం కలిగించిన బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుని ఆచూకీ తెలిపిన వారికి రూ.5లక్షలు నజరానా ఇవ్వనున్నట్లు గుమ్మిడిపూండి డీఎస్పీ జయశ్రీ తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో భాగంగా వరదయ్యపాళెం మండలంలో పర్యటించిన డీఎస్పీ పత్రికా ప్రకటన ద్వారా వివరాలను తెలిపారు. తమిళనాడు రాష్ట్రం ఆరంబాకంలో ఓ బాలికను అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. నలుగురు ఎస్పీల పర్యవేక్షణలో నాలుగు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం తరఫున రూ. 5లక్షలు నజరానా ఇస్తామని ఆమె వివరించారు. 9952060948 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు.
సీట్ల కేటాయింపులోనూవైఫల్యమేనా?
తిరుపతి సిటీ : ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జాబితా మంగళవారం విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అర్ధరాత్రి వరకు సీట్ల కేటాయింపుపై ఎటువంటి సమాచారం అందకపోవడంతో నిరాశతో ప్రభుత్వంపై విరుచకుపడుతున్నారు. సీట్ల కేటాయింపులోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, షెడ్యూల్ ప్రకారం జూన్ 22న ప్రకటించాల్సి ఉండగా ఇంతవరకు తమకు ఎటువంటి మెసేజ్‌లు రాలేదని వాపోతున్నారు. ఇటు అధికారులను వివరణ కోరగా మరో గంటలో తల్లిదండ్రుల మొబైల్‌ఫోన్లకు మెసేజ్ వస్తుందంటూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు చెబుతుండడం గమనార్హం.

న్యాయం కోసమే ‘శక్తి వారియర్స్’