
ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల మ్యాగజైన్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ:ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘ఆరా ఆఫ్ ఆర్ట్స్ మ్యాగజైన్’ను వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, ప్రిన్సిపాల్ ఆచార్య సుధారాణి మంగళవారం వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో గణనీయమైన చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఆర్ట్స్ విభాగం కార్యాలయం ప్రకాశం భవనంలో ఉండడం, అలాగే ఆర్ట్స్ కళాశాల పేరు ప్రతిబింబించేలా ఆరా పేరుతో ఈ మ్యాగజైన్ తీసుకుని రావడం హర్షణీయమన్నారు. మ్యాగజైన్‌లో విద్యార్థుల కవితలు, వ్యాసాలు, వివిధ శాఖల పురోభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో సాధించిన విజయాలు వంటి వాటితో ప్రకాశిస్తుందని, ఇది దాదాపు 200 పైచిలుకు పుటలు కలిగిన డాక్యుమెంటరీ వంటి పుస్తకమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య భాస్కర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య సుమకిరణ్, వార్డెన్ ఆచార్య ప్రయాగ, ఆచార్య రాజేశ్వరమ్మ, ఆచార్య అమీనుల్లా, డాక్టర్ ఓబులేసు, రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.