
హామీలు తూచ్
కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ముంచేసింది. మద్దతు ధర ఇవ్వకుండా సర్వనాశనం చేసింది.
– 10లో
లిక్కర్ స్కామ్ పేరుతో అక్రమ అరెస్టు
ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తున్నా. కూటమి కక్షపూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవు. కూటమి అరాచకాల పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉ న్నాయి. సీఎం చంద్రబాబు కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అనేది ఒట్టి అభూతకల్పన. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక ఆయన్ను బలహీనపరిచేందుకు కుట్రపన్నుతున్నారు. ఇప్పటి వరకు మద్యం అక్రమ కేసులో అరెస్ట్ చేసిన మా పార్టీ నేతల పై ఎలాంటి ఆధారాలూ చూపలేదు. కూటమిపై ప్రజా తిరుగుబాటు మొదలవుతుంది. అక్రమ అరెస్టులకు మా పార్టీ నేతలెవ్వరూ భయపడరు.
– బియ్యపు మధుసూదన్‌రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే
ఎంపీ అరెస్ట్ దారుణం
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది దారుణం. కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. భూటకుపు స్కామ్‌ని అంటగట్టారు. పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులు బనాయించి ఇరికించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ కుట్ర సాగుతోంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ సాగిస్తున్నారు. ఆయన సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్‌సీపీకి బలమైన నేతలుగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఎంపీని అరెస్ట్ చేశారు. ఇలాంటి రాజకీయాలు మానుకోండి.
– నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త

హామీలు తూచ్