
అక్రమ అరెస్టుతో అణగదొక్కలేరు
చిత్తూరు కార్పొరేషన్: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉయ్ స్టాండ్ ఫర్ మిథున్‌రెడ్డి అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు మిన్నటించారు. అనంతరం మీడియాతో విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడారు. జగనన్నకు సన్నిహితంగా ఉండే నాయకుల పై కూటమి ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. పార్లమెంట్ సభ్యుడికి రాష్ట్రంలో జరిగిందంటున్న స్కాంకు సంబంధమేమిటని ప్రశ్నించారు. రాయలసీమలో బలమైన నాయకుడు అయిన పెద్దిరెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించే మిథన్‌పై ఆరోపణలు పేరిట కేసుల్లో ఇరికించాలని చూడడం అన్యాయమన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్‌సీపీకి మరింత ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గదన్నారు నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, ఉద్యోగులు, పెన్సన్షర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, గుడిపాల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు, ప్రజాప్రతినిధులు బాబునాయుడు, త్యాగ, రజనీకాంత్, మధుసూదన్, ప్రసాద్‌రెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి, ప్రతిమారెడ్డి, హరీషారెడ్డి, నారాయణ, మురళీరెడ్డి, మనోజ్‌రెడ్డి, అప్పొజీ, ఆను, అల్తాఫ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.