
అంతా తికమకగా ఉంది
డిగ్రీ అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి చేసిన ప్రకటన తికమకగా ఉంది. ప్రవేశాలు ఆన్‌లైన్ అంటూ మళ్లీ ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రకటించింది. కనీసం వెబ్‌సైట్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. దీంతో మా తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చేర్పిస్తామంటున్నారు. ప్రవేశాలు ఆలస్యం కావడంతో బీటెక్‌లో జాయిన్ అవుతున్నా. – శ్రావణి ప్రియ, విద్యార్థి, తిరుపతి
అధ్యాపకులకే అర్థం కావడం లేదు
డిగ్రీ ప్రవేశాల విధి విధానాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాల అధ్యాపకులకు సైతం అర్థం కావడం లేదు. ఇప్పటికే పలుమార్లు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియపై ఆరా తీశాం. వెబ్‌సైట్ తెరుచుకుంటే కానీ తమకే స్పష్టత లేదని అధ్యాపకులు చెబుతున్నారు. –విజయశ్రీ, విద్యార్థిని, తిరుపతి
అధికారులపై చర్యలు తీసుకోవాలి
డిగ్రీ అడ్మిషన్లను అస్తవ్యస్తం చేసిన ఉన్నత విద్యామండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి. డబుల్ మేజర్ , సింగిల్ అంటూ మూడు నెలలు కాలయాపన చేశారు. ఇప్పడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంటూ అయోమయానికి గురి చేస్తున్నారు. – బండి చలపతి,
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి
విద్యార్థుల జీవితాలతో చలగాటం
రాష్ట్ర చరిత్రలో డిగ్రీ ప్రవేశాలు జాప్యం కావడం ఇదే తొలిసారి. ప్రభు త్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉన్నత విద్యామండలి అధికారులు రెండు రోజుల క్రితం ఇచ్చిన ప్రకటన అయోమయంగా ఉంది.
– భగత్ రవి, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా కార్యదర్శి

అంతా తికమకగా ఉంది

అంతా తికమకగా ఉంది

అంతా తికమకగా ఉంది