
నివాళులు అర్పిస్తున్న రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు, కళాకారులు
పులిచెర్ల(కల్లూరు):మండలంలోని అయ్యావాండ్లపల్లె పంచాయతీలో ఆదివారం తెల్లవారుజామున ఏనుగులు పంట పొలాలపై దాడి చేసి ధ్వంసం చేశాయి. గత రెండు రోజులుగా ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. అరటి, వరి, మామిడి, ముఖ్యంగా డ్రిప్ పైపులను ధ్వంసం చేయడంతో రైతులకు భారీగా పంటనష్టం జరిగింది. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంతో తీవ్రంగా నష్ట పోతున్నామన్నారు.
పులికంటి కృష్ణారెడ్డికి నివాళి
తిరుపతి కల్చరల్: రాయలసీమ రవిశాస్త్రి పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఆయన సాహితీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్‌రెడ్డి, కార్యదర్శి కేఎన్.రాజా, కళాకారులు పొన్నాల జేజిరెడ్డి, టి.సుబ్రమణ్యంరెడ్డి, చెంగారెడ్డి, రవి, దీపక్, చెంగయ్య, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుచానూరు రోడ్డులోని నవజీవన్ బ్‌లైండ్ రిలీఫ్ సెంటర్‌లో 300 మందికి అన్నదానం చేశారు.

అయ్యావాండ్లపల్లెలో అరటి తోటను ధ్వంసం చేసిన ఏనుగులు
Comments
Please login to add a commentAdd a comment