ఇలాగైతే ‘టెండర్లు’ ఎందుకో?
– 8లో
చిత్తూరులో తమ కనుకూలురుకు ముందే పనులప్పగించి ఆపై టెండర్లు ఆహ్వానించడం విమర్శలకు తావిస్తోంది.
9,10న మంత్రులు కుప్పం రాక
కుప్పం: కుప్పంలో ఈ నెల 9, 10 తేదీల్లో ముగ్గురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నట్లు ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం తెలిపారు. కుప్పం మండలం, కంగుంది గ్రామంలో నిర్వహించనున్న బౌల్డరింగ్ ఫెస్టివల్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖా మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, దేవదయ శాఖ మంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డి ఈనెల 9వ తేదీ రానున్నట్లు తెలిపారు. అదేవిధంగా 10వ తేదీ శనివారం పర్యాటక శాఖామంత్రి కందుగ దుర్గేష్ కుప్పంలో పర్యటిస్తారన్నారు. కంగుందిలో నిర్వహిస్తున్న బౌల్డరింగ్ ఫెస్టివల్ కార్యక్రమంలో 10వ తేదీ జరగనున్న ఫైనల్ పోటీలను మంత్రులు పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. కుప్పం ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
రహదారి నిబంధనలు తప్పనిసరి
చిత్తూరు రూరల్: రహదారి నిబంధనలను విధిగా పాటించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో బుధవారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అంబేడ్కర్ విగ్రహ కూడలిలో కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ మాసోత్సవంలో ‘శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన’ అని సరికొత్త నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. అనంతరం ఎంపీ డూడి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు రద్దు చేస్తామన్నారు. రహదారి భద్రత మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి నిరంజన్‌రెడ్డి, ఆర్టీఓ సునీల్, ఎంవీఐలు నరసింహులు, మురళి, శివకుమార్, కుసుమ పాల్గొన్నారు.


