బేలుపల్లెలో పట్టపగలే చోరీ
బైరెడ్డిపల్లె : మండలంలోని బేలుపల్లెలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన నారాయణప్ప బుధవారం ఉదయం ఇంటికి తాళాలు వేసుకుని పొలం వద్దకు వెళ్లాడు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లగా బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 50 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు వరకు నగదు చోరీ చేశారు. సమాచారం అందుకున్న సీఐ పరుశురాముడు, ఎస్‌ఐ చందనప్రియ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇదివరకే గ్రామంలో చాలాసార్లు చోరీలు జరిగాయని, దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు పోలీసులకు విన్నవించారు.


