కలలు సాకారం చేసుకోవాలి
రొంపిచెర్ల : స్వయం సహాయక సభ్యులు తమ కలలు సాకారం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. బుధవారం రొంపిచెర్ల సీ్త్ర శక్తి కార్యాలయంలో ఆమె మండల సమాఖ్య లీడర్లు, వీఓ లీడర్లు, సంఘమిత్రలకు శిక్షణ తరగతులను నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ సంఘాల అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతులు, జీవనోపాధి, సామాజిక భద్రత, ఆస్తులు, భూముల కొనుగోళ్లు వంటి కలలను సాకారం చేసుకోవాలన్నారు. సభ్యులకు ఇచ్చిన రుణాలను తిరిగి అదేవిధంగా బ్యాంక్‌లకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
పాఠశాలల తనిఖీ
కుప్పం: పట్టణంలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాలలను డీఈవో రాజేంద్రప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుప్పంలో పర్యటించిన ఆయన రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆరా తీశారు. ఫిబ్రవరిలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యధిక శాతంతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో రాజారామ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలలు సాకారం చేసుకోవాలి


