
ముంబై: ఎమర్జెన్సీ సేవల సంస్థ జెంజో దేశవ్యాప్తంగా 450 నగరాల్లో 25,000 ప్రైవేట్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. 15 నిమిషాల్లోపే స్పందించే విధంగా ఈ నెట్‌వర్క్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రథమ చికిత్స, సీపీఆర్ ట్రైనింగ్ మొదలైన వాటిపై అవగాహన పెంచేందుకు జొమాటోతో పాటు ఇతరత్రా డెలివరీ ప్లాట్‌ఫాంలు, ఈకామర్స్ సంస్థలతో చేతులు కలిపినట్లు వివరించింది.
దీని టోల్ ఫ్రీ నంబరు 1800 102 1298గా ఉంటుంది. 5 కి.మీ. పరిధికి బేసిక్ అంబులెన్స్ చార్జీలు రూ. 1,500గా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు అదనంగా రూ. 50 చెల్లించాలి. కార్డియాక్ అంబులెన్స్‌కైతే 5 కి.మీ.కు రూ. 2,500, ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటరుకు రూ. 100 చార్జీలు వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను బట్టి మరిన్ని నగరాల్లో మరిన్ని అంబులెన్స్‌లను జోడిస్తామని సంస్థ సహ వ్యవస్థాపకురాలు శ్వేతా మంగళ్ తెలిపారు.