కస్టమర్లకు యప్‌‌ టీవీ మెగా ఆఫర్‌ | Yupp TV Flash Sale 2020 Bringing 0nline Shows At Riveting Prices | Sakshi
Sakshi News home page

కస్టమర్లకు యప్‌‌ టీవీ మెగా ఆఫర్‌

Jul 27 2020 4:19 PM | Updated on Jul 27 2020 5:02 PM

Yupp TV Flash Sale 2020 Bringing 0nline Shows At Riveting Prices - Sakshi

ముంబై: కరోనా వైరస్ దెబ్బతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరు ఇంట్లోనే సినిమాలు, కార్యక్రమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో‌(ఆన్‌లైన్‌) ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన యప్‌ టీవీ కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ క్రమంలో వినోధం కోరుకునే వారికి యప్‌ టీవీ 24జులై నుంచి జులై 28వరకు ఐదు రోజుల కాలపరిమితితో ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్‌ ప్రకటించిన రోజులలో యప్‌ టీవీ ద్వారా అందించే సినిమాలు, అన్ని కార్యక్రమాలకు ఆఫర్‌ వర్తించనుంది. 

ప్రస్తుతం తెలుగులో విశేషాధారణ పొందిన జబర్దస్త,  క్యాష్‌ లాంటి కార్యక్రమాలతో యప్‌ టీవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలమాళం, బెంగాళీ, కన్నడ, మరాఠి తదితర భాషలలో తక్కువ ప్యాకేజీతో కస్టమర్లను అలరిస్తోంది. అయితే వివిధ దేశాలలో యూప్‌ టీవీ వివిధ ప్యాకేజీలతో ప్రకటించింది. యూప్‌ టీవీలో క్లాసికల్‌ సినిమాల నుంచి ప్రస్తుత బ్లాక్‌బ్లస్టర్‌ సినిమాల వరకు 3,000సినిమాలు యప్‌ టీవీ అందిస్తోంది. వివిధ దేశాలలో యప్‌ టీవీ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు

ఆస్ట్రేలియాలో సంవత్సర ప్యాకేజీ 119.99డాలర్లు
న్యూజిలాండ్‌లో సంవత్సర ప్యాకేజీ 119.99డాలర్లు
యూకేలో   సంవత్సర ప్యాకేజీ     69.99డాలర్లు
యూరప్‌లో  సంవత్సర ప్యాకేజీ    69.99డాలర్లు
యూఎస్‌ఏ    సంవత్సర ప్యాకేజీ   99.99డాలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement