Youtube Trends 2021: యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయినవి ఇవే...అందులో 30 వెడ్స్‌ 21, ఇంకా ఎన్నో..

Youtube Trends 2021 Gaming Tops India Charts Along Comedy Pranks - Sakshi

కరోనా రాకతో దేశవ్యాప్తంగా ఓటీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందరు ఇంటికే పరిమితమవ్వడంతో ఓటీటీ యూజర్ల బేస్‌ అమాంతం అధికమైంది. ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిశాయి. ఇకపోతే యూట్యూబ్‌లో కూడా కంటెంట్‌ క్రియేటర్లకు భారీగానే డబ్బులు వచ్చాయి. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా యూట్యూబ్‌ ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగినట్లు యూట్యూబ్‌ డైరెక్టర్ సత్య రాఘవన్ వెల్లడించారు. 2021లో యూట్యూబ్‌లో వీపరితంగా  ట్రెండింగ్‌ ఐనా అంశాలను యూట్యూబ్‌ ఇండియా  విడుదల చేసింది. 

భారత్‌లో ట్రెండ్‌ ఐనవి..!
2021 యూట్యూబ్‌ ట్రెండింగ్‌ చాట్‌లో గేమింగ్‌ తొలిస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో కామెడీ వీడియోలు అత్యంత ప్రజాదరణను పొందాయని యూట్యూబ్‌ వెల్లడించింది. గేమింగ్‌, కామెడీ వీడియోలను యూజర్లు అధికంగా చూసారని సత్యరాఘవన్‌ వెల్లడించారు. మ్యూజిక్‌, యూట్యూబ్‌ షార్ట్స్, వెబ్‌ సిరీస్‌లు కూడా ఎక్కువ మేర ట్రెండ్‌ అయ్యాయి. వీటితో పాటుగా ప్రాంక్‌ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

యూట్యూబ్‌ షార్ట్‌ వీడియోలో...
2021లో యూట్యూబ్‌ షార్ట్‌ వీడియోలో  A2 మోటివేషన్ (అరవింద్ అరోరా), మిస్టర్ జ్ఞాని ఫాక్ట్స్ అగ్రస్థానంలో నిలిచారు. టెక్నాలజీ విషయంలో Crazy XYZ , MR. INDIAN HACKER అగ్ర కంటెంట్‌ క్రియేటర్లుగా ఉన్నారు. 

కామెడీ విషయంలో 40 నిమిషాల నిడివి గల ‘Round2Hell’ హారర్-కామెడీ జోంబీ అపోకలిప్స్ షార్ట్ ఫిల్మ్ ట్రెండింగ్ వీడియోలో నంబర్ 1గా నిలిచింది.  షార్ట్-ఫామ్ వీడియోలో కూడా నంబర్‌ 1గా భారత్‌లో నిలిచింది. యూట్యూబ్‌లో క్యారీమినాటి, బీబీ కీ వైన్స్, ప్రముఖ టీవీ షో తారక్ మెహతా కా ఊల్తా చష్మా నుంచి ఒక సన్నివేశం మొదటి పది స్థానాల్లోకి వచ్చిన ప్రసిద్ధ కామెడీ వీడియోలుగా నిలిచాయి.

వెబ్‌సిరీస్‌ ట్రెండింగ్‌లో...30 వెడ్స్‌ 21, సూర్య..
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్,  స్క్రిప్ట్ కంటెంట్‌ను యూజర్లు ఎగబడి చూశారు. ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్‌)రూపొందించిన  ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్, డైస్ మీడియా ఆపరేషన్ MBBS, క్లచ్ అత్యంత ఆదరణను పొందాయి. తెలుగులో వచ్చిన వెబ్‌సిరీస్‌లు కూడా తమ సత్తాను చాటాయి. ఈ ఏడాది ట్రెండ్‌ ఐనా వాటిలో  గర్ల్ ఫార్ములా రూపొందించిన 30 వెడ్స్ 21, షణ్ముఖ్ జస్వంత్ నటించిన సూర్య వెబ్‌సిరీస్‌ కూడా నిలిచాయి. 

జెన్‌ జెడ్‌ వారే ఎక్కువ..!
ఈ ఏడాది భారత్‌లో జెన్‌ జెడ్‌(1997 నుంచి పుట్టిన వారు) జనరేషన్‌ యూట్యూబ్‌లో ఎక్కువ మేర వీక్షించినట్లు తెలుస్తోంది. గేమింగ్‌ చానల్స్‌కు వీరు కాసుల వర్షాన్ని కురిపించారని సత్య రాఘవన్ వెల్లడించారు
చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top