రెడ్‌మీ, షావోమీ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌! అస్సలు మిస్‌ చేసుకోవద్దు!

Xiaomi Announces Battery Replacement Program For Old Phones - Sakshi

మీరు రెడ్‌మీ, షావీమీ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారా? కానీ, ఆ ఫోన్‌ బ్యాటరీలు డెడ్‌ అయ్యాయ్యా? ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కడం లేదా? లేదంటే ఛార్జింగ్‌ ఎక్కినా నిలవడం లేదా? అయితే మీకో శుభవార్త.  

షావోమీ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు శుభవార్త. యూజర్లు వినియోగిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ సమస్యల్ని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు మందగించిన ఫోన్‌ల బ్యాటరీను మార్చి వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను అమర్చుతున్నట్లు ప్రకటించింది.

 

షావోమీ తన యూజర్లకు రూ.499కే పాత ఫోన్‌ల బ్యాటరీల స్థానంలో కొత్త బ్యాటరీలను అందిస్తున్నట్లు ట్విట్‌ చేసింది. మీ షావోమీ, రెడ్‌ మీ ఫోన్‌ బ్యాటరీ డెడ్‌ అయినట్లు అనిపించినా, లేదంటే ఛార్జింగ్‌ ఎక్కకపోయినా మీ సర్వీస్‌ సెంటర్‌ని ఆశ్రయిస్తే తక్కువ ధరకే కంపెనీ బ్యాటరీలను అందిస్తామని ట్వీట్‌లో పేర్కొంది. 

బ్యాటరీ ఎప్పుడు రిప్లెస్‌ చేయాలి
షావోమీ, రెడ్‌మీ స్మార్ట్‌ ఫోన్‌ల బ్యాటరీ ఛార్జింగ్‌  లైఫ్‌ టైమ్‌ ఉదాహరణకు 10 గంటల ఉంటుంది. కానీ ప్రతిరోజు పలు మార్లు ఛార్జింగ్‌ తగ్గిపోతుంటే బ్యాటరీ మార్చుకోవాలి. లేదంటే ఫోన్‌ ఛార్జింగ్‌ 100శాతం ఉండి నిమిషాల వ్యవధిలో 80-90కి పడిపోతే అప్పుడు మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చదవండి👉 జూన్‌లో విడుదల కానున్న 9 స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top