ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ .. ఆణుబాంబు తయారీతో సమానం!

Warren Buffett Compares Ai To The Creation Of Atom Bomb - Sakshi

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌జీపీటీ వినియోగంపై ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని సృష్టించడం అంటే అణు బాంబును తయారు చేయడంతో సమానమని అన్నారు. దీంతో కృత్తిమ మేధస్సు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో వారెన్‌ బఫెట్‌ చేరిపోయారు. 

చాట్‌జీపీటీ టూల్స్‌ వినియోగం వల్ల మానవ మనుగడుకు ప్రశ్నార్ధకంగా మారుతుందని టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యానించారు. ఏఐని నిలిపివేయాలని లేఖలు సైతం రాశారు. తాజాగా ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా వారెన్‌ బఫెట్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చాంశనీయంగా మారింది.

చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్‌ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్‌ కంపెనీల వార్నింగ్‌

నెబ్రాస్కాలోని ఒమాహాలో జరిగిన బెర్క్‌షైర్ హాత్‌వే వార్షిక స‌మావేశంలో చర్చ సందర్భంగా వారెన్‌ బఫెట్‌.. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని అణు బాంబుతో పోల్చారు. ఈ అంశాన్ని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. కొంతకాలం క్రితం ప్రముఖ బిలియనీర్, తన స్నేహితుడు బిల్ గేట్స్‌ చాట్‌జీపీటీ గురించి చెప్పినప్పుడు..దాని సామార్ధ్యాలకు గురించి తెలుసుకొని ఆశ్చర్య పోయా. కానీ, సాంకేతికతపై తాను కొంచెం భయపడుతున్నానని చెప్పారు. 

అన్ని రకాల పనులు ఒక్కరే చేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పుడు మనం మిగిలిన పనుల్ని చేయలేం. కొత్తగా సృష్టించలేం. మనం చేసే పని మంచిదై ఉండొచ్చు. కానీ అందులోనూ కొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి. అందుకు సరికొత్త నిర్వచనమే అణుబాంబు. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో అణుబాంబు ప్ర‌యోగం రుజువు చేసింద‌ని గుర్తు చేశారు. మ‌నం ఏం చేసినా.. ఏది క‌నిపెట్టినా 200 ఏండ్ల త‌ర్వాత ప్ర‌పంచానికి మేలు చేసేలా ఉండాలి. ప్ర‌పంచం మొత్తాన్ని ఏఐ మార్చేస్తుందని న‌మ్ముతున్న‌ట్లు చెప్పిన ఆయన ఏ టెక్నాలజీ మానవ మేధస్సు కంటే మెరుగ్గా ఆలోచిస్తాయనని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు.

చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్‌ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top