
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గత నెలలోనే టైగన్ ధరల పెరుగుదలను గురించి ప్రకటించింది. అయితే ఇప్పుడు కొత్త ధరలను కూడా వెల్లడించింది. రియల్ డ్రైవ్స్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా అప్డేట్ చేయడం వల్లే ఈ ధరల పెరుగుదల జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ధరల పెరుగుదలకు గల కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రస్తుతం కంఫర్ట్‌లైన్, హైలైన్, ఫస్ట్ యానివర్సరీ, టాప్‌లైన్, జిటి, జిటి ప్లస్ అనే ఆరు వేరియంట్‌లలో లభిస్తోంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 45,000 పెరిగింది. అదే సమయంలో జిటి & జిటి ప్లస్ ధరలు వరుసగా రూ. 30,000, రూ. 10,000 పెరిగాయి. ఇక హైలైన్ వేరియంట్ ధర రూ. 24,000 పెరిగింది.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది.
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్‌జీ, పీఎన్‌జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి)
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.
ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్‌పి పవర్, 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. పనితీరు పరంగా ఈ రెండు ఇంజిన్లు ఉత్తమంగా ఉంటాయి.