యూటీఐ నుంచి రెండు కొత్త ఫండ్‌లు | UTI Mutual Fund launches two index funds | Sakshi
Sakshi News home page

యూటీఐ నుంచి రెండు కొత్త ఫండ్‌లు

Feb 3 2025 7:47 AM | Updated on Feb 3 2025 9:41 AM

UTI Mutual Fund launches two index funds

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund) రెండు ఇండెక్స్‌ ఫండ్‌లను ఆవిష్కరించింది. నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్‌ 400 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్‌ ఫండ్, నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. మిడ్‌–స్మాల్‌ క్యాప్‌ సెగ్మెంట్లో వృద్ధి అవకాశాలున్న నాణ్యమైన స్టాక్స్‌లో ఒకే ఫండ్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసేందుకు మిడ్‌స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌ ఉపయోగపడుతుందని సంస్థ హెడ్‌ (ప్యాసివ్, ఆర్బిట్రేజ్, క్వాంట్‌ స్ట్రాటెజీస్‌) శర్వన్‌ కుమార్‌ గోయల్‌ తెలిపారు.

మరోవైపు, దేశీయంగా తయారీ పరిశ్రమ సంస్థల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మాన్యుఫాక్చరింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ రెండు న్యూ ఫండ్‌ ఆఫర్లు ఫిబ్రవరి 10తో ముగుస్తాయి. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. గణనీయంగా వృద్ధి అవకాశాలున్న కేటగిరీలు, పరిశ్రమల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందేందుకు ఈ రెండు ఫండ్‌లు ఇన్వెస్టర్లకు తోడ్పడగలవని గోయల్‌ వివరించారు.    

హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నిఫ్టీ100 క్వాలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌.. 
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా నిఫ్టీ100 క్వాలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 14న ముగుస్తుంది. పటిష్టమైన ఆర్థిక పనితీరుతో, వ్యాపార కార్యకలాపాలు సాగించే నాణ్యమైన సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంపొందించుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుంది.

రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ, రుణాలు తదితర అంశాల ప్రాతిపదికన నిఫ్టీ 100 ఇండెక్స్‌లో నుంచి ఎంపిక చేసిన 30 స్టాక్స్‌ ఈ ఇండెక్స్‌లో ఉంటాయి. ఈ పథకంలో ఇన్వెస్టర్లు కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నవనీత్‌ మునోట్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement