Twitter India Layoffs: భారత ఉద్యోగులపై ఎలన్‌ మస్క్‌ దెబ్బ

Twitter Starts Laying Off Employees In India - Sakshi

భారతీయ ఉద్యోగులకు ట్విటర్‌ భారీ షాక్‌ ఇచ్చింది. కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌ టీంపై వేటు వేసింది. ఇప్పటికే ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఇంటికి  సాగనంపిన ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు భారత ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడ్డారు. 

44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌..ఖర్చు తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరల్డ్‌ వైడ్‌గా ట్విటర్‌ ఉద్యోగుల్ని తొలగిస్తుండగా.. భారత ఉద్యోగులను తొలగించింది. 

గత వారం ట్విటర్‌ సీఈవో పరాగ్ అగర్వాల్‌, లీగల్‌ ఎగ్జిక్యూటీవ్‌ విజయ గద్దెలపై మస్క్‌ వేటు వేశారు. తాజాగా భారత్‌కు చెందిన ఇతర ఉద్యోగుల్ని ట్విటర్‌ తొలగించింది. ‘లే ఆఫ్ ప్రారంభమైంది. నాతో పాటు మిగిలిన నా సహచర ఉద్యోగులకు దీనికి సంబంధించిన ఇమెయిల్స్‌ వెళ్లాయి అని పేరు చెప్పేందుకు ఇష్టపడని భారత ట్విటర్‌ ఉద్యోగి తెలిపారు. 

చదవండి👉 ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపు, కీరోల్‌ ప్లే చేస్తున్న భారతీయుడు?

ప్రతి ఒక్కరికి మెయిల్స్‌ 
ట్విటర్‌ అంతకుముందు ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెయిల్స్‌ పంపింది. ఆ మెయిల్స్‌లో.. ట్విటర్‌ను ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా శుక్రవారం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తాం. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఇమెయిల్‌ను స్వీకరిస్తారు అని పేర్కొంది.

ఉద్యోగుల తొలగింపుతో పాటు ట్విటర్ సిస్టమ్‌లు, కస్టమర్ డేటా కోసం నిర్వహిస్తున్న సంస్థకు చెందిన అన్నీ కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసివేస్తుంది. ‘మీరు ఆఫీస్‌లో ఉన్నా.. లేదంటే ఆఫీస్‌కు బయలుదేరుతున్నా’ దయచేసి ఇంటికి  వెళ్లండి అని ట్విటర్‌ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో తెలిపింది.

చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ వైరల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top