
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అక్టోబరు 1, 2,3 తేదీల్లో 11వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. సుమారు 150 నిర్మాణ సంస్థలు, 400 ప్రాపర్టీలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే పుంపుకుంటోంది. ఇటీవల ఆగస్టులో క్రెడాయ్ ఆధ్వర్యంలో హైటెక్స్, హైదరాబాద్‌లో జరిగిన ప్రాపర్టీ షోకి సైతం మంచి స్పందన లభించింది.
చదవండి: CII-Anarock survey: రూ.90 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లను తెగకొనేస్తున్నారు