వాట్సాప్‌కు పోటీగా టెలిగ్రాంలో కొత్త ఫీచర్స్‌..

Telegram introduces New Features To Its Users - Sakshi

కొత్త అప్‌డేట్స్ ఎల్లప్పుడూ యాప్స్‌కు బూస్టింగ్‌నిచ్చే అంశాలేనని భావిస్తోంది టెలిగ్రామ్‌. ఇందులో భాగంగా వాట్సాప్‌ పోటీని తట్టుకునేందుకు టెలిగ్రామ్‌ సరికొత్త అప్‌డేట్స్‌తో లేటెస్ట్‌ ఫీచర్స్‌ను విడుదల చేసింది. వినియోగదారుల చాట్స్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసే ఫీచర్‌ను జోడించింది. ప్రొఫైల్‌ పిక్చర్‌, ఎమోజీ  కేటగిరితో పాటు ఇతర ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.

తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఫీచర్‌తో మొత్తం చాట్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం లభించినట్లయింది. టెలిగ్రామ్‌లో ఎగువన ఉన్న ట్రాన్స్‌లేటింగ్‌ ఎంటైర్‌ చాట్స్‌ బటన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా లేటెస్ట్‌ ఫీచర్‌  సేవలను పొందొచ్చు. వినియోగదారులను ఉత్తేజపరిచే ఫీచర్స్‌లో ఇదీ ఒకటిగా నిలవనుందని టెలిగ్రామ్‌ అంచనా వేస్తోంది.

ప్రీమియం కస్టమర్లకు మాత్రమే..
ట్రాన్స్‌లేటింగ్‌ ఎంటైర్‌ చాట్స్‌ కేవలం టెలిగ్రాం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర వినియోగదారులు ఈ  ఫీచర్‌ను పొందాలంటే వ్యక్తిగత సందేశాలను ఎంచుకుని అనువాదం నొక్కితే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అదే ట్రాన్స్‌లేట్‌ అవుతుంది.

ఇక ప్రొఫైల్‌ ఫోటో మేకర్‌తో వినియోగదారులు తమ ప్రొఫైల్‌ చిత్రంలో ఏదైనా స్కిక్కర్‌ లేదా యానిమేటెడ్‌ ఎమోజీని మార్చుకునేందుకు అనుమతిస్తుంది. టెలిగ్రామ్ ప్రీమియం లేకపోయిన్పటికీ.. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాల కోసం యానిమేటెడ్, అలాగే అనుకూల ఎమోజీలను ఉపయోగించవచ్చని టెలిగ్రామ్‌ ప్రకటించింది. అంతేకాకుండా టెలిగ్రామ్‌ కూడా కొన్ని ప్రత్యేక ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా స్టిక్కర్లు, ఎమోజీలను వర్గాల వారీగా క్రమబద్ధీకరించింది. దీంతో వినియోగదారులు పది లక్షల కంటే ఎక్కువ విభిన్న స్టిక్కర్లు, ఎమోజీలను షేర్‌ చేసే అవకాశముంది. 

టెలిగ్రామ్‌ మరో సరికొత్త ఫీచర్‌ "నెట్‌వర్క్ యూసేజ్"ను కూడా తమ కస్టమర్లకు పరిచయం చేసింది. దీని ద్వారా వైఫై, మొబైల్ డేటాను కస్టమర్లు ఎంత వినియోగించారో తెలుసుకునేందుకు టెలిగ్రామ్‌ అనుమతిస్తుంది. వారి డేటాకు అనుగుణంగా ఆటో డౌన్‌లోడ్‌ సెట్టింగ్‌లను మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించింది. "ఆటో-సేవ్ ఇన్‌కమింగ్ మీడియా" ఫీచర్‌ ద్వారా వీడియా పరిమాణం, వీడియో రకం, ఏ చాట్‌ నుంచి వీడియో వచ్చిందనే విషయాలను సులభంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది.
చదవండి: చైనా యాప్‌లపై కేంద్రం కొరడా.. ఈసారి ఏకంగా

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top